• కాకరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో మీకు తెలుసా| Abhaya Ayurveda | Dr. B.Vijaya Laxmi | Bitter Guard
    Aug 16 2023

    కాకరకాయ అని చెప్పగానే.. వామ్మో.. ఆ కర్రీ వద్దులేనని చెప్పేస్తారు చాలామంది. అంత చేదు తినడం మనతో కాదులేనని అంటుంటారు. కానీ కాకరకాయ తింటే.. వచ్చే చేదు కంటే.. దాని నుంచి శరీరానికి జరిగే మంచే ఎక్కువగా ఉంటుంది.

    తినే ఆహారంలో చేదు అంటే.. చాలామంది ఇక అక్కడ నుంచి తప్పుకుంటారు. తర్వాత తింటానులేనని వెళ్లిపోతారు. కాకరకాయ లాంటి కర్రీని తినేందుకు విసుక్కుంటారు. కానీ ఈ చేదు.. ఆరోగ్యానికి ఎంతో మంచి అనే విషయాన్ని మాత్రం మరిచిపోతారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికన్ దేశాలలో ఒక ప్రసిద్ధ కూరగాయ కాకరకాయ. చేదు రుచి ఉన్నప్పటికీ వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా వాడుతుంటారు కొంతమంది.

    Show more Show less
    8 mins
  • కేవలం 1 రూపాయి కి లభించే నిమ్మలో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా | Dr.Bavanari Vijayalakshmi | Dwani
    Jun 27 2023

    కేవలం 1 రూపాయి కి లభించే నిమ్మలో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా | Dr.Bavanari Vijayalakshmi | Dwani Voice Services

    Show more Show less
    11 mins
  • కందగడ్డ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా | Abhaya Ayurveda | Telugu Podcasts
    Jun 13 2023

    ·  మూలశంఖకు (పైల్స్) కందతో మందు: పై పొట్టు తీసిన కందను పల్చని ముక్కలుగా కోసి ఎండబెట్టి మెత్తటి పొడిగా చేయాలి. బెల్లాన్ని కూడ మెత్తగా చేయాలి. ఈ రెండు పొడులను సమభాగాలుగా కలబోసి బాగా కలిపి, ఉసిరికాయ పరిమాణంలో వుండలుగా కట్టి (లడ్డు లా) నిల్వ చేసుకొని ప్రతి రోజు పొద్దున ఒకటి, రాత్రికి ఒకటి చొప్పున తింటే మూలశంఖ వ్వాది నయమవుతుందని ఆయుర్వాద వైద్యులు అంటారు.

    · కొన్ని ద్రవ్యాలలో (ఈ ద్రవ్యాలు ఏమిటో తెలియదు) నానబెట్టి, ఎండబెట్టిన కంద ముక్కలని "మదన్ మస్త్" అన్న పేరుతో బజారులో అమ్ముతూ ఉంటారు. దీనిని మూలశంఖకీ, అజీర్తికీ మందుగా వాడతారు.

    · మదన్ మస్త్, చిత్రమూలం (ప్లంబాగో జైలానికం) వేరు, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, బెల్లపు పాకం - వీటన్నిటిని సమ పాళ్లల్లో కలిపి చేసే "సూరణ మాదకం" అనే లేహ్యం అజీర్తి రోగాన్ని చక్కగా కుదుర్చుతుందని డా. నద్‌కర్ణి "The Indian Materia Medica" అనే గ్రంథంలో పేర్కొన్నారు ట.

    Show more Show less
    9 mins
  • అవిస గింజలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు తెలుసా? | Abhaya Ayurveda Telugu Podcast
    Jun 5 2023

    అవిస గింజలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు తెలుసా? | Abhaya Ayurveda Telugu Podcast

    Show more Show less
    10 mins
  • మనం చిన్ననాటి నుండి తింటున్న బఠానీల్లో ఇన్ని లాభాలు ఉన్నాయా
    Apr 29 2023

    బిర్యానీ దగ్గర నుంచి రోడ్ సైడ్ దొరికే ఛాట్ వరకు పచ్చి బఠానీ వేయకుండా ఉండరు. చాలా మంది వాటిని ఏరి పక్కన పెట్టేస్తారు. మంచి రంగు, రుచి కారణంగా వాటిని కొంతమంది తింటారు కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువగా తెలుసు. పచ్చి బఠానీలు లెగ్యూమ్ కుటుంబానికి చెందినవి. చలికాలంలో వీటిని తినడం వల్ల శరీరానికి అనేక లాభాలు చేకూరతాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఇ, కె తో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, ఫైబర్, జింక్ లభించే మంచి మూలం ఇవి ఆహారం రుచిని పెంచడమే కాదు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి.

    Show more Show less
    6 mins
  • నేటి కాలంలో ఊబకాయం ఎందుకు వస్తుంది ? దాన్ని అరికట్టడం ఎలా ?
    Apr 3 2023

    నేటి కాలంలో ఊబకాయం ఎందుకు వస్తుంది ? దాన్ని అరికట్టడం ఎలా ?

    Show more Show less
    10 mins
  • చర్మం యవ్వనంగా కనిపించటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
    Mar 1 2023
    • ఒక శీతాకాలం మాత్రమే కాకుండా ఎ కాలంలో అయినా మన చర్మ సంరక్షణ చూసుకోవాలి. శీతాకాలంలో ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి.. డ్రై స్కిన్ వారు చాలా జాగ్రత్తగా మెలగాలి. ఈ కాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. అందుకని చర్మం కూడా ఈ శీతాకాలంలో పొడిబారిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం ఉన్నవారు జాగ్రత్త తీసుకోవాలి.
    • కొన్ని చిట్కాలు పాటించడం వల్ల శీతాకాలంలో చర్మ సంరక్షణ ఎలా కాపాడుకోవాలో చూద్దాం. స్నానం చేయడం, రాత్రిపూట చలి నుంచి చర్మాన్ని ముఖ్యంగా పెదవులను, పాదాలను కాపాడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం చేయాలి. విటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహారం తినాలి. వింటర్ స్కిన్ కేర్ లాంటివి వాడాలి.
    • కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ, లావెండర్ సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేసినట్టయితే శరీరం నునుపుగా తయారవుతుంది. మసాజ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
    • పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వాక్స్‌ను కరిగించి, అందులో కొద్దిగా ఆవాల నూనెను కలిపి పగుళ్లు ఉన్న చోట రాస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి.

    Show more Show less
    11 mins
  • పిప్పలి అంటే ఏంటి ? దానిని ఎలా వాడుతారు. పిప్పలి వాళ్ళ మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి?
    Feb 14 2023

    పిప్పలి గురించి ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఆయుర్వేదంలో దాని ఔషధ, ఆహార గుణాలను వివరించారు. ఇది సా.పూ. ఆరవ లేదా ఐదవ శతాబ్దంలో గ్రీస్‌కు చేరుకుంది. అయితే హిప్పోక్రేట్స్ దీనిని మసాలాగా కాకుండా ఔషధంగా భావించాడు. కొలంబియన్ మార్పిడికి ముందు, గ్రీకులు, రోమన్లకు పిప్పలి ఒక ముఖ్యమైన, ప్రసిద్ధమైన మసాలా దినుసుగా ఉండేది.

    Show more Show less
    9 mins