Episodios

  • ఎపిసోడ్ - 54 - "శివ తత్వం-అర్ధనారీశ్వర తత్వం"
    Feb 20 2025

    పరమ శివుడి అర్ధనారీశ్వర దివ్య రూపం వెనుక ఉన్న నిగూఢమైన రహస్యం ఏమిటి?? ఆ రూపాన్ని స్వామి ఎందుకు ధరించారు? సకల సృష్టికి ఆది దంపతులు అయిన శివ పార్వతుల నిజ తత్వం ఏమిటి? అర్ధనారీశ్వర రూపం వెనుక దాగి ఉన్న యోగ పరమార్థాన్ని ఆవిష్కరించే సంభాషణా సమాహారం ఈ వారం పాడ్కాస్ట్.

    Más Menos
    5 m
  • ఎపిసోడ్ - 53 - "శివ తత్వం- కైలాసం"
    Feb 13 2025

    కైలాసం మహా దేవుడైన పరమ శివుడి నివాసం. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ పర్వత ప్రత్యేకతను గురించి తెలుసుకోవాలని చూశారు. రెండు పర్యాయాలు ఈ పర్వతం పైకి విమానాలను పంపేందుకు ప్రయత్నం చేయగా, ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కైలాసం పవిత్ర స్థలం. జగన్మాత పార్వతి, జగత్ పిత పరమేశ్వరుడు నివాసం ఉండే ప్రదేశం కైలాసం. అయితే సుషుమ్న క్రియా యోగులు ధ్యానం ద్వారా కైలాస పర్వత దర్శనం చేసుకొవడం ఎలా..? అనే ఆసక్తికర విషయాల సమాహారమే ఈ వారం పాడ్కాస్ట్.

    Más Menos
    6 m
  • ఎపిసోడ్ - 52 - "శివ తత్వం- క్షీర సాగర మథనం"
    Feb 6 2025

    దేవతలు, దానవులు సాగర మథనం చేసినప్పుడు మొదట ఆవిర్భవించింది హాలాహలం. ఈ భయంకర విష ప్రభావం వల్ల లోకాలు నాశనం కావడం మొదలైంది. బ్రహ్మాది దేవతలు, రాక్షసులు “రక్షమాం” అంటూ శివుడిని శరణు వేడారు. ఆ కరుణా సింధువు గరళాన్ని మింగి విశ్వాన్ని రక్షించాడు. ఈ అద్భుత పురాణ కథలోని నిగూఢార్థాన్ని తెలియజేసే పాడ్కాస్ట్ ఈ వారం.

    Más Menos
    4 m
  • ఎపిసోడ్ - 51 - "శివ తత్వం- రుద్రాక్ష వైభవం"
    Jan 30 2025

    రుద్రాక్ష పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైనది. రుద్రాక్ష మాలలను శివుడు మొదలుకొని ఎందరో యోగులు ఆభరణంగా ధరిస్తారు. హిమవత్ పర్వత ప్రదేశంలో లభించే రుద్రాక్షలు సాధనకు ఎంతో ఉపకరిస్తాయి. రుద్రాక్ష ధారణ, రుద్రాక్ష విశిష్టత ఇత్యాది విషయాల సమాహారం ఈ వారం సుషుమ్న వాణి పాడ్కాస్ట్.

    Más Menos
    3 m
  • ఎపిసోడ్ - 50 - "మహా మృత్యుంజయ మంత్రం"
    Jan 23 2025

    మహా మృత్యుంజయ మంత్రాన్ని మహా సంజీవని మంత్రం అంటారు. ఈ మహా మంత్ర నిగూఢార్థం, మంత్ర ఆవిర్భావం, మంత్ర విశేషం ఇత్యాది విషయాల సమాహారం ఈ వారం సుషుమ్న వాణి పాడ్కాస్ట్.

    Más Menos
    5 m
  • ఎపిసోడ్ - 49 - "పంచాక్షరీ మంత్రం"
    Jan 15 2025

    ఈ ఎపిసోడ్ లో శివ పంచాక్షరీ మంత్ర వైశిష్ట్యాన్ని గురించి, పంచాక్షరీ మంత్ర మహత్తు, ఓంకార బీజాక్షర మహిమ వంటి ఆసక్తికర విషయాలను గురించి తెలుసుకుందాం.

    Más Menos
    5 m
  • ఎపిసోడ్ - 48 - "శివ తత్వం - ఆది యోగి శివుడు"
    Jan 8 2025

    ఈ ఎపిసోడ్ లో ఆది యోగి అయిన శివుడిని ఆది గురువుగా, క్రియా యోగ దీక్షా గురువుగా దర్శిద్దాం. శివ తత్వంలోని అంతరార్థాన్ని అన్వేషిద్దాం. మీ ప్రశ్నలు, మీ విలువైన సలహాలు, సందేశాలు క్రింది ఈమెయిల్ కి పంపండి

    sushumnavani@divyababajikriyayoga.org

    Más Menos
    5 m
  • ఎపిసోడ్ - 47 - "యోగం - మార్గం"
    Dec 18 2024

    ఈ ఎపిసోడ్, ఆత్మను పరమాత్మలో లయం చేసే యోగం గురించి , దానికి సాధనంగా ఉపయోగపడే యోగా గురించి , యోగి యొక్క లక్షణాలను గురించి వివరిస్తుంది.

    Más Menos
    14 m
adbl_web_global_use_to_activate_webcro768_stickypopup