SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి) Podcast Por DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION arte de portada

SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)

SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)

De: DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION
Escúchala gratis

సుషుమ్న వాణికి స్వాగతం. శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంటారు, మనం మన రోజును తప్పక సుషుమ్న క్రియాయోగ ధ్యానంతో ప్రారంభించి ఆత్మ పరిశీలనతో ముగించాలి అని. ధ్యానం మరియు ఆత్మ పరిశీలనల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మన ఆధ్యాత్మిక పరిణామం యొక్క వేగాన్ని, దిశను నిర్ణయిస్తుంది. ఈ పాడ్ కాస్ట్ సిరీస్ సుషుమ్న క్రియా యోగాలో మన ప్రయత్నాలను శక్తివంతం చేయటానికి, జీవించడానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తుంది.DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION Espiritualidad
Episodios
  • ఎపిసోడ్ - 54 - "శివ తత్వం-అర్ధనారీశ్వర తత్వం"
    Feb 20 2025

    పరమ శివుడి అర్ధనారీశ్వర దివ్య రూపం వెనుక ఉన్న నిగూఢమైన రహస్యం ఏమిటి?? ఆ రూపాన్ని స్వామి ఎందుకు ధరించారు? సకల సృష్టికి ఆది దంపతులు అయిన శివ పార్వతుల నిజ తత్వం ఏమిటి? అర్ధనారీశ్వర రూపం వెనుక దాగి ఉన్న యోగ పరమార్థాన్ని ఆవిష్కరించే సంభాషణా సమాహారం ఈ వారం పాడ్కాస్ట్.

    Más Menos
    5 m
  • ఎపిసోడ్ - 53 - "శివ తత్వం- కైలాసం"
    Feb 13 2025

    కైలాసం మహా దేవుడైన పరమ శివుడి నివాసం. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ పర్వత ప్రత్యేకతను గురించి తెలుసుకోవాలని చూశారు. రెండు పర్యాయాలు ఈ పర్వతం పైకి విమానాలను పంపేందుకు ప్రయత్నం చేయగా, ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కైలాసం పవిత్ర స్థలం. జగన్మాత పార్వతి, జగత్ పిత పరమేశ్వరుడు నివాసం ఉండే ప్రదేశం కైలాసం. అయితే సుషుమ్న క్రియా యోగులు ధ్యానం ద్వారా కైలాస పర్వత దర్శనం చేసుకొవడం ఎలా..? అనే ఆసక్తికర విషయాల సమాహారమే ఈ వారం పాడ్కాస్ట్.

    Más Menos
    6 m
  • ఎపిసోడ్ - 52 - "శివ తత్వం- క్షీర సాగర మథనం"
    Feb 6 2025

    దేవతలు, దానవులు సాగర మథనం చేసినప్పుడు మొదట ఆవిర్భవించింది హాలాహలం. ఈ భయంకర విష ప్రభావం వల్ల లోకాలు నాశనం కావడం మొదలైంది. బ్రహ్మాది దేవతలు, రాక్షసులు “రక్షమాం” అంటూ శివుడిని శరణు వేడారు. ఆ కరుణా సింధువు గరళాన్ని మింగి విశ్వాన్ని రక్షించాడు. ఈ అద్భుత పురాణ కథలోని నిగూఢార్థాన్ని తెలియజేసే పాడ్కాస్ట్ ఈ వారం.

    Más Menos
    4 m
Todavía no hay opiniones