Episodios

  • Principles for Advancing & Possessing - ముందుకు సాగి స్వాధీనపరచుకొనుటకు సూత్రములు
    Jan 5 2026

    ఒక విశ్వాసి తన జీవితములో ముందుకు సాగి స్వాధీనపరచుకొనుట అంటే ఏమిటి?

    2026లోని మొదటి బ్రేక్త్రూ ఆదివారాన బోధింపబడిన ఈ ప్రభావవంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడు విశ్వాసులమైన మనకొరకు ఉంచిన వాటన్నిటినీ మనము సొంతం చేసుకోవడానికి మనలను బలపరిచే ఆత్మీయ సూత్రాలను పంచుకుంటున్నారు. ఆత్మీయ ఎదుగుదల, స్పష్టత మరియు నిరంతర అభివృద్ధికి మూలమైన దేవుని వాక్యాన్ని ధ్యానించుట యొక్క కీలకమైన పాత్రను వారు ఇక్కడ నొక్కి చెబుతున్నారు.

    ఈ సందేశము మీ ఆత్మీయ దర్శనాన్ని బలోపేతం చేసి, దేవుని వాక్యం పట్ల మీ నిబద్ధతను మరింత పెంచి, జీవితంలోని ప్రతి రంగంలోనూ ముందుకు సాగి, దేవుడు మీకై ఉంచిన వాటన్నిటినీ స్వాధీనపరచుకొనుటకు మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. దేవుని వాగ్దానాలను విని, ధ్యానించి, వాటిలో ధైర్యంగా ముందుకు నడవండి.

    Más Menos
    1 h y 16 m
  • Receiving the Fullness of Christ - క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా?
    Dec 29 2025

    క్రీస్తు పరిపూర్ణతలో జీవించుట అంటే ఏమిటి? ‘క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా?’ అనే ఈ శక్తివంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తు పరిపూర్ణత అంటే సంపూర్ణ విమోచన అని వివరిస్తున్నారు. వారు ప్రతి విశ్వాసి జీవితములో పాపము నిర్మూలించబడిందని వెల్లడిస్తూ నూతన నిబంధన క్రింద మన రక్షణ నిమిత్తము శాశ్వతంగా పూర్తి వెల చెల్లించిన క్రీస్తు రక్తము యొక్క ప్రత్యేకతను నొక్కి చెబుతున్నారు.

    విశ్వాసులు నూతన నిబంధన మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని మరియు క్రీస్తు పూర్తి చేసిన కార్యము ప్రకారంగా మన మనసులను రూపాంతరపరచుకుంటూ ఉండాలని పాస్టర్ బెన్ గారు మనలను పురికొల్పుతున్నారు. ఈ సందేశము మీ గుర్తింపునకు స్పష్టతను తీసుకువస్తుంది, మీ నిశ్చయతను బలపరుస్తుంది మరియు మీ ఆలోచనా విధానాన్ని నూతన నిబంధన సత్యానికి అనుగుణంగా మారుస్తుంది.

    ఈ వాక్యాన్ని విని, స్వీకరించి, ప్రతి రోజు క్రీస్తు యొక్క సంపూర్ణతలో నడవండి.

    Más Menos
    1 h y 38 m
  • [Bilingual] Grand Christmas Miracle Service
    Dec 27 2025

    అద్భుతాలకు మీ సమయమిదే. ఈ క్రిస్మస్ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు యేసు క్రీస్తు యొక్క అద్భుత జననాన్ని గుర్తు చేస్తూ, విశ్వాసులు అద్భుతాలలో నడచుటకున్న దీవెనను గురించి తెలుపుతున్నారు.

    క్రీస్తు శతృవు యొక్క కార్యాల మీద విజయాన్నెలా పొందాడో తెలుసుకొని, మీ ఆరోగ్యము, కుటుంబము, ఆర్ధిక విషయాలు, వృత్తి, పరిచర్య ఇంకా మరిన్ని రంగాలలో అద్భుతాలను చూచుటకు విశ్వాసంతో వాక్యాన్ని స్వీకరించండి!

    మీ దృష్టిని దేవుని వాక్యము పై నిలిపి ఈ మసకబారిన లోకములో ప్రకాశమానమైన అద్భుతము వలె ఉంటూ, ప్రజలను క్రీస్తు వైపునకు నడుపుదురు గాక!

    Más Menos
    56 m
  • Created for the Miraculous - అద్భుతములు
    Dec 22 2025

    అద్భుతాలు అరుదుగా జరుగుటకు ఉద్దేశించబడ్డాయా లేదా అవి విశ్వాసులకు రోజువారీ వాస్తవికతగా ఉండాలా? ‘అద్భుతములు’ అను ఈ శక్తివంతమైన సందేశంలో, దేవుని రాజ్యంలో అద్భుతాలు ఏదో అప్పుడప్పుడు జరిగే సంఘటనలుగా, మన జీవితాల్లోని కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైనవిగా ఉండకూడదు కానీ ప్రతి రోజూ విశ్వాసులు తమ జీవితాల్లోని ప్రతి రంగములో అనుభవిస్తూ ఉండాల్సినవైయుండాలని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తున్నారు. అద్భుతాల కొరకు మనమెందుకు పోరాడాలి అనేదానికి బలమైన వాక్యాధారిత కారణాలను, అద్భుతాలకు వ్యతిరేకంగా ఈ కాలములో ఉన్న అపోహలను మరియు దేవునిని నిజంగా విశ్వసించే ప్రతి ఒక్కరినీ అద్భుతాలు ఎందుకు అనుసరించాలో అనే విషయాన్ని గురించి పాస్టర్ గారు ఈ ప్రసంగము ద్వారా స్పష్టమైన లేఖనాత్మక అవగాహనను మనకు ఇస్తున్నారు.

    ఈ వర్తమానము మీ ఆలోచనా విధానాన్ని సవాలు చేసి, మీ విశ్వాసాన్ని బలపరచి, దేవునికి మీకై అద్భుతాల కొరకు ఉన్న ప్రణాళికలోనికి మిమ్మల్ని త్రిప్పి నడిపిస్తుంది.

    ఈ వాక్యాన్ని విని, ప్రేరేపింపబడి, మీరు దేని కోసమైతే సృష్టించబడ్డారో ఆ వాస్తవికతలో ప్రతిరోజూ నడవండి.

    Más Menos
    1 h y 13 m
  • Created for Good Works - సత్కార్యముల కొరకు సృష్టింపబడితిమి
    Dec 16 2025

    మీరు క్రైస్తవులా? అయితే, మీ విశ్వాసాన్ని మీ జీవితములో ఎలా కనపరుస్తారు? ఇతరులను నిందించుటకు తొందరపడుతుంటారా? ట్రాఫిక్లో తొందరగా చిరాకుపడిపోతుంటారా? ఎప్పుడూ స్వీయ జాలితో కుమిలిపోతుంటారా? మీ ఆర్ధిక విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారా? అలా అయితే, మీరు కలిగి ఉన్నారని చెప్పుకుంటున్న ఆ విశ్వాసాన్ని నిశితంగా పరిశీలించాల్సిన సమయమిదే.

    ఈ కనువిప్పు కలిగించే ప్రసంగములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన పనులకు, మాటలకు, ఆలోచనలకు, డబ్బును వాడే విధానానికి పర్యవసానాలుంటాయని, మంచి కార్యాలకు మంచి ప్రతిఫలము, చెడు కార్యాలకు చెడు ప్రతిఫలము ఉంటుందని విశ్వాసులకు గుర్తుచేస్తున్నారు. మంచి కార్యాలు చేయుటకే కృప మనకు అనుగ్రహించబడింది.

    మీ విశ్వాసానికి, మీ కార్యాలకు మధ్య పొంతన లేదని మీరు ఒప్పింపబడుతుంటే, ఈ రోజే దానిని మార్చుకొనుటకు ఈ సందేశము మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి. మీ మంచి కార్యాలు విస్తరించి, లోకములోని అన్యులు క్రీస్తు వైపునకు త్రిప్పబడుదురు గాక. ఆమేన్!

    Más Menos
    1 h y 23 m
  • Faith, Works & Rewards - విశ్వాసము, క్రియలు, ప్రతిఫలములు
    Dec 8 2025

    స్పష్టమైన ఫలితాలను ఉత్పత్తి చేసే నిజమైన విశ్వాస జీవితాన్ని కలిగియుండుట అంటే ఏమిటి? విశ్వాసులను బలపరిచే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసము, వాక్యాధారిత క్రియల మధ్య ఉన్న క్రియాశీలక సంబంధాన్ని గురించి తేటగా తెలియజేస్తున్నారు.

    ప్రతీ విశ్వాసి తన విశ్వాసము మృతమైపోకుండా అది పరిపూర్ణమగునట్లు, తన విశ్వాసపు మంటను తప్పక ఎలా రగిలిస్తూ ఉండాలో ఇక్కడ కనుగొనండి. స్వచ్ఛమైన విశ్వాసము క్రియల ద్వారా ఎలా విశదమవుతుందో మరియు ఉద్దేశపూర్వకంగా చేసే క్రియలు దేవుని వాగ్దానాలను పొందుకునే స్థానములోనికి మిమ్ములను ఎలా తీసుకువచ్చి దేవుడు మీ కొరకు ఉంచిన ప్రతిఫలాలన్నిటినీ పొందుకొనుటకు ఎలా కారణమవుతాయో తెలుసుకోండి.

    మీరీ వర్తమానాన్ని వింటూండగా, మీ హృదయం మీ విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవడానికి, మీ కార్యాలను బలోపేతం చేయడానికి మరియు మీ జీవితానికై దేవుడు కోరుకునే ప్రతిఫలాల్లోనికి ధైర్యంగా మిమ్ములను నడపడానికి ప్రేరేపించబడును గాక!

    Más Menos
    1 h y 14 m
  • The Grace, The Race & The Reward - కృప, పందెము ప్రతిఫలము
    Dec 3 2025

    మీరు జీవితములో స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుందా? మీ సామర్థ్యాన్నికనుగుణంగా నిజంగా మీరు జీవిస్తున్నారా లేదా అని ఆలోచిస్తున్నారా?

    కనువిప్పు కలిగించే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడనుగ్రహించిన బహుమతులను సద్వినియోగం చేసుకొని, మీపైయున్న ప్రత్యేకమైన దైవిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చుట ఎలాగో బోధిస్తూండగా వినండి. అలాగే, మీ స్వంత పందెముపై దృష్టి నిలిపి, ఇతర విషయాలచే మరల్చబడకుండా, మీ పనిని చక్కగా పూర్తి చేసినందుకై ఎలా ప్రతిఫలాలను పొందవచ్చో నేర్చుకొనండి.

    ప్రతిఫలాలు, బహుమతుల మధ్య ఉన్న వాక్యానుసారమైన భేదాన్ని కనుగొని, మీ పందెమును శ్రద్ధతో ఉద్దేశ్యపూర్వకంగా పరుగెత్తుటకు సిద్దపడండి. లెక్క అప్పజెప్పాల్సిన వారిగా బాధ్యతాయుతులమై దేవుని కృపను సద్వినియోగం చేసుకుందాం.

    Más Menos
    1 h y 11 m
  • Lifestyle of Thanksgiving - కృతజ్ఞతతో కూడిన జీవనశై
    Nov 27 2025

    ఒక విశ్వాసిగా మీరు కృతజ్ఞత కలిగిన హృదయమనే వాస్తవికతలో నిజంగా నడుస్తున్నారా? గొప్ప పరివర్తన కలిగించే ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కాలానుగుణమైన లేక పరిస్థితులాధారితమైనది కాక ప్రాథమికమైనదిగా మనము కలిగియుండాల్సిన కృతజ్ఞత జీవనశైలి యొక్క లోతు మరియు శక్తిని మన కొరకు వెలికితీస్తున్నారు.

    ఈ సందేశములో ప్రతి విశ్వాసి జీవితంలో కృతజ్ఞత ఎందుకు ఆవశ్యకమో మరియు అది దేవునితో మీ నడకను ఎలా రూపుదిద్దుతుందో కనుగొనండి. కృతజ్ఞత యొక్క ముఖ్య అంశాలను నేర్చుకొని, నిరంతరం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండుట దేవుని మంచితనాన్ని మరింత స్పష్టంగా చూడటానికి మిమ్మల్ని ఎలా సరి ఐన స్థానములో ఉంచుతుందో అర్థం చేసుకోండి.

    మీరు ఈ వాక్యాన్ని వింటూండగా, మీ హృదయము అనుదిన కృతజ్ఞతను అలవరచుకొనుటకు ప్రేరేపించబడి, ఈ సందేశములో దేవునికై కృతజ్ఞత కలిగిన జీవనశైలిని నిజముగా జీవించుటకు ఇవ్వబడిన ఆచరణాత్మక విధానాలను మీరు స్వీకరించుదురు గాక.

    Más Menos
    53 m
adbl_web_global_use_to_activate_DT_webcro_1694_expandible_banner_T1