Episodios

  • "ఏ దేశమేగినా .. మాతృభాష ని మరవద్దు " - Aruna Gubba | Vijeta
    Apr 21 2026

    అమెరికాలో డేటా బేస్ అనలిస్ట్‌గా పనిచేస్తూ, అక్కడి తెలుగు వారిని ఒక దగ్గర కలుపుతూ మన సంస్కృతిని, మన భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్న అరుణ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ వారం 'విజేత' కార్యక్రమంలో! వృత్తిరీత్యా టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నా, తెలుగు కల్చరల్ అసోసియేషన్ కో ఆర్డినేటర్ గా ఉంటూ మన సంస్కృతిని భావి తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈమె. అసలు ఆమె చేస్తున్న కార్యక్రమాలేంటో, ఈ భాషా సేవ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటో తెలుసుకోవడానికి… ఈ పాడ్కాస్ట్ ను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి!

    Aruna is working as a database analyst in the United States, and at the same time, she is bringing Telugu people together and working to preserve our culture and language.

    This week on the “Vijetha” program, we bring you her inspiring journey!

    Even though she is in the technology field professionally, she is also serving as a Telugu Cultural Association coordinator, making efforts to pass our culture on to future generations.

    What kind of activities is she doing? What is the real intention behind her service to the Telugu language?

    To find out more… don’t miss this podcast. Do listen!


    Guest: Aruna

    Host: Renu Sree


    #TALRadioTelugu #Vijetha #ArunaJourney #VijethaProgram #TeluguPodcast #TeluguPride #TeluguCulture #TeluguLanguage #IndianDiaspora #WomenInTech #InspiringWomen #CulturalPreservation #TeluguAbroad #NRIStories #TALRadio #TouchALifeFoundation

    Más Menos
    44 m
  • కోకిల యొక్క అద్భుతమైన కుండ | Super Girls Series - 1
    Apr 17 2026

    పిల్లల కోసం రేడియో కథలు…!

    ఒక ఊర్లో కోకిల అనే అమ్మాయి ఉండేది. ఆమె ఒకరోజు ఒక అద్భుతమైన కుండను కొన్నది… ఆ కుండ ఇంటికి వచ్చినప్పటి నుండి ఆమె జీవితమే అద్భుతంగా మారిపోయింది. మరి అసలు ఆ కుండ చేసిన మాయలేంటి? కోకిల జీవితాన్ని ఆ కుండ ఎలా మార్చింది? ఆ కుండ నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ కథలో మనం తెలుసుకోవచ్చు… తప్పకుండా వినండి.. వినిపించండి.. అస్సలు మిస్ అవ్వకండి!

    Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో మొదటి కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…!

    మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి!


    Radio Stories for Kids…!

    In a village, there lived a girl named Kokila. One day, she bought a magical pot… and from the moment it came home, her life changed in amazing ways!

    What magic did the pot have? How did it change Kokila’s life? And what can we learn from it? You’ll find all these answers in this beautiful story… so don’t miss it—listen and share it with your kids!

    This is the first story in the “SuperGirls Series,” brought to you by TALRadio in collaboration with Katha.org.

    Tune in every Friday at 7:30 AM and again at 7:30 PM, only on TALRadio.

    Listen… and let your kids enjoy it too!


    #TALRadioTelugu #Katha.org #ChildrenStories #KidsLearning #BedtimeStories #StoryForKids #AudioStories #KidsEntertainment #MoralValues #Storytelling #LearnWithStories #FunLearning #IndianStories #KidsPodcast #ParentingTips #CreativeKids #ListenAndLearn #TALRadio #TouchALifeFoundation

    Más Menos
    7 m
  • ఇది కేవలం Walkathon మాత్రమే కాదు... పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక వేదిక! | Special Interview With Rider Josh
    Apr 17 2026
    ఈ రోజుల్లో పిల్లలు కేవలం పుస్తకాలు, ఫోన్లు.. అంటూ నాలుగు గోడలకే పరిమితమైపోతున్నారు.. వారిలో శారీరక దృఢత్వం, వారి లక్ష్యం పట్ల సరైన అవగాహన తగ్గిపోతున్నాయనే ఆందోళన మనందరిలోనూ పెరిగిపోతుంది!కానీ, పిల్లల భవిష్యత్తు అంటే కేవలం చదువులు, మార్కులు మాత్రమే కాదని.. క్రమశిక్షణ, ఆరోగ్యం, సరైన మార్గదర్శకత్వం ఉన్నప్పుడే వారు అద్భుతాలు సాధించగలరని నమ్ముతోంది 'రైడర్ జోష్ ఫౌండేషన్'. అందుకే, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడం కోసం ఒక ప్రత్యేకమైన walkathon ను నిర్వహిస్తోంది. ఆర్మీ, డిఫెన్స్, మెడికల్.. ఇలా వివిధ రంగాల నిపుణులను ఒకే దగ్గరకు చేర్చి, పిల్లల సందేహాలను తీరుస్తూ వారి కలలకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నారు వీళ్ళు. మార్నింగ్ టైంలో సరదాగా నడిచే ఈ walkathon, పిల్లలకు క్రమశిక్షణను, టీమ్ స్పిరిట్‌ను అందించనుంది. మరి అసలు ఈ walkathon లక్ష్యం ఏంటి? ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ podcast లో రైడర్ జోష్ మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!These days, children are mostly limited to books and mobile phones, staying within four walls. Because of this, there is growing concern that their physical fitness and clarity about their goals are decreasing.But the “Rider Josh Foundation” believes that a child’s future is not just about studies and marks. With discipline, good health, and proper guidance, children can achieve great things. That’s why they are organizing a special walkathon to build confidence and encourage a healthy lifestyle among kids.Experts from fields like the army, defense, and medical sectors will come together to interact with children, answer their questions, and guide them towards their dreams. This morning walkathon is designed to be fun while also teaching discipline and team spirit.So, what is the main goal of this walkathon? Why is it being organized? Rider Josh shares many interesting insights in this Podcast. Don’t miss it!Guest: Rider JoshHost: KalyaniWalkathon date and time: 19th april 2026, morning 6amPlace: Sanjeevaiah Children's park, Hyderabadమరిన్ని వివరాలకు: https://riderjoshfoundation.org/Home/walkathon#RiderJoshFoundation #Walkathon #KidsHealth #HealthyLifestyle #ChildDevelopment #FitnessForKids
    Más Menos
    19 m
  • "కాన్సెప్ట్ అర్ధం చేసుకోవటమే అసలైన చదువు" - Raghava, Sravani | Special Interview
    Apr 13 2026

    చదువు అంటే కేవలం పరీక్షల కోసం బట్టీ పట్టడం, మార్కులు సాధించడం మాత్రమే కాదు.. విద్య మనలో ఒక మంచి మార్పు తీసుకురావాలి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. మరి మన ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థులు వాటిని నేర్చుకుంటున్నారా? అన్న ప్రశ్న నుండే ఏర్పడింది… 'Ignis careers' సంస్థ! ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు కోల్పోతున్న ఆ ‘లైఫ్ స్కిల్స్’ ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించి వారిని గ్లోబల్ లెవల్‌లో ఎలా సిద్ధం చేయాలి? ఇలాంటి ఎన్నో కీలక విషయాలను ఆ సంస్థకు చెందిన రాఘవ మరియు శ్రావణి గారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మనతో పంచుకున్నారు.


    రాబోయే రోజుల్లో టెక్నాలజీ సాయంతో మరో 22 లక్షల మంది విద్యార్థులకు చేరువవ్వాలనే వారి లక్ష్యం, సామాజిక అసమానతలను తొలగించే దిశగా వారు చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను అస్సలు మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!


    Education is not just about memorizing for exams or scoring marks. It should bring a positive change in us and give us the confidence to face future challenges. But are students really learning these skills in today’s education system?

    This question led to the creation of Ignis Careers. What are the important life skills that students are missing today? How can children in rural areas learn communication skills and get ready for a global level?

    In this special interview, Raghav and Shravani from Ignis Careers share their insights on these important topics.

    Their goal is to reach 2.2 million students in the coming years using technology, and their efforts to reduce social inequality are truly inspiring.

    Don’t miss these powerful ideas that can shape students’ futures make sure to listen!


    Guests: Raghava, Sravani

    Host: Bharath


    #Education #LifeSkills #SkillBasedLearning #FutureEducation #StudentDevelopment #IgnisCareers

    Más Menos
    41 m
  • ఒక చిన్న సాయం… ప్రపంచాన్ని మార్చగలదా? - Deepak Gumaledar | Special Interview
    Apr 9 2026

    మీరు ఎప్పుడైనా ఎవరికైనా చిన్న సహాయం చేసి, వాళ్ళ ముఖంలో కనిపించే ఆ చిరునవ్వుని చూసి ఆనందించారా? అయితే.. ఒక్కసారి మీరు Random Act of Kindness సంస్థ గురించి తెలుసుకోవాల్సిందే!

    Project Vidya, Project Kreeda, Project Grooming, Project Animals… ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో విషయాల్లో తమ చుట్టూ ఉన్న సమాజానికి సహాయం చేస్తూ, సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకుంటున్నారు. సమాజం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కంటే, ఆ సమాజాన్ని బాగుచేసే పనిలో మనం కూడా భాగమైతే ఎంత బావుంటుందో కదా! సరిగ్గా దాన్నే నిజం చేసి చూపిస్తోంది ఈ సంస్థ!

    మరి మీకు కూడా సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉందా? ఒకరి జీవితంలో వెలుగులు నింపాలని ఉందా? అయితే Random Act of Kindness సంస్థ డైరెక్టర్ వారి సంస్థ గురించి చెప్పిన విషయాలను తప్పకుండా వినండి అస్సలు మిస్ అవ్వకండి!

    Have you ever helped someone in a small way and felt truly happy seeing the smile on their face? If yes, then you should definitely know about Random Acts of Kindness! Through initiatives like Project Vidya, Project Kreeda, Project Grooming, and Project Animals, this organization is making a meaningful difference across various areas and demonstrating a strong sense of responsibility towards society.

    Instead of just thinking about social issues, they actively work to create positive change and inspire others to do the same. If you also have the desire to give back to society and bring light into someone’s life, then don’t miss listening to what the director of Random Acts of Kindness has to share about their journey and impact. It's truly inspiring!


    Guest: Deepak Gumaledar

    Host: Adarsh


    #TALRadioTelugu #RandomActsOfKindness #SpreadKindness #BeTheChange #SocialImpact #VolunteerLife #MakeADifference #KindnessMatters #ChangeMakers #PositiveImpact #NGOIndia #YouthForChange #ServeSociety #InspireOthers #TALRadio #TouchALifeFoundation

    Más Menos
    38 m
  • "చిరంజీవి గారి డాన్స్ కి వీరాభిమాని ని... " - ఉదయ్ శంకర్ | Part-2 | మా ఊరు - 68
    Apr 6 2026

    మ్యూజికల్ ఫ్యామిలీ నుండి వచ్చి, ప్రస్తుతం సియాటెల్‌లో స్థిరపడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్ గారు, గత వారం “మా ఊరు” పాడ్కాస్ట్ లో తన చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్న విషయం తెలిసిందే. ఈ వారం పాడ్కాస్ట్ లో ఆయన తన కాలేజీ రోజుల గురించి, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన రోజుల గురించి, అలాగే కెరీర్‌లో స్థిరపడటానికి పడిన కష్టాలను గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు.

    ముఖ్యంగా, తనకు ఉద్యోగం రావడానికి తన తండ్రి పడిన తపనను గుర్తు చేసుకుంటూ, తన డ్యాన్స్ స్కూల్ జర్నీ గురించి కూడా ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. మరి సొంత ఊరి నుండి సియాటెల్ వరకు సాగిన ఈ ఎమోషనల్ అండ్ ఇన్‌స్పిరేషనల్ జర్నీని అస్సలు మిస్ అవ్వకండి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే ఆత్మీయ బంధాన్ని గుర్తుచేసే ఈ వారం పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి!


    Every journey has a rhythm and for Uday Shankar, it began in a musical home and led all the way to Seattle.

    In this “Maa Ooru” podcast, the well-known choreographer shares beautiful memories from his childhood and takes us deeper into his life in this latest episode. He opens up about his college days, the dedication he put into preparing for competitive exams, and the struggles he faced while building a stable career.

    He also fondly and emotionally recalls his father’s efforts in helping him secure a job, and shares how his dream of starting a dance school slowly turned into reality.

    From his hometown roots to an international journey, this story is both emotional and inspiring. More than anything, it highlights the powerful bond between parents and children making it a must-listen episode!


    Guest: Uday Shankar

    Host: Usha


    #TALRadioTelugu #MaaOoruPodcast #UdayShankar #ChoreographerLife #InspirationalPodcast #TeluguPodcast #EmotionalStory #SuccessJourney #FromVillageToSeattle #IndianChoreographer #DanceJourney #FatherSonBond #ParentingLove #CareerStruggles #TALRadio #TouchALifeFoundation

    Más Menos
    48 m
  • "Autism పిల్లలున్న తల్లిదండ్రులకు మేము ట్రైనింగ్ ఇస్తాము" - శారద రామ్ | Special Interview
    Apr 3 2026

    పిల్లలు పిలిచినా పలకకపోయినా, అందరిలో కలవడానికి ఇబ్బంది పడుతున్నా.. అది వారి మొండితనం అనుకుంటుంటాం. కానీ, ఆ చిన్న చిన్న సంకేతాలే వారి భవిష్యత్తును నిర్ణయించే ఆటిజం లక్షణాలు కావచ్చు!

    అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో ప్రతి 68 మందిలో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, సరైన అవగాహన లేక చాలామంది దీనిని గుర్తించలేకపోతున్నారు. ఆటిజంతో ఉన్న పిల్లలకు చిన్నప్పుడే సరైన థెరపీ ఇస్తే, వారిలో మంచి మార్పు వస్తుందని నిరూపిస్తున్నారు 'ఆరంభ్ ఫౌండేషన్' వ్యవస్థాపకులు శారద రామ్ గారు. అంతే కాకుండా ఆటిజం ఉన్న పిల్లలను ఎలా పెంచాలనే దానిపై కూడా వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడం వీరి ప్రత్యేకత!

    అసలు ఆటిజం లక్షణాలను ఎలా గుర్తించాలి? వారి ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటి? ఒక తల్లిగా, ఒక మార్గదర్శిగా శారద గారు చేస్తున్న ఈ గొప్ప కృషి ఎంతో మెచ్చుకోదగింది. పిల్లల పెంపకం పట్ల, ఆటిజం పట్ల మీకున్న ఆలోచనలను మార్చే ఈ మనసును హత్తుకునే పాడ్కాస్ట్ ఇంటర్వ్యూను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి!


    Even if children don’t respond when called or find it difficult to mingle with others, we often think it’s just stubborn behavior. But these small signs could actually be early indicators of autism that may shape their future.

    In today’s world, statistics say that 1 in every 68 children is affected by autism. However, due to lack of awareness, many people fail to recognize it. Experts like Sharada Ram, founder of Aarambh Foundation, have shown that with the right therapy at an early age, children with autism can make significant progress. Not only that, they also train parents on how to better understand and raise children with autism.

    So, how can we identify the signs of autism? What are the reasons behind their behavior? As a mother and a guide, Sharada Ram’s efforts are truly inspiring. Don’t miss this heart-touching podcast interview that can change the way you think about parenting and autism. Be sure to listen!


    Guest: Sharada Ram

    Host: Kalyani


    Website: https://www.aarambhautism.org/Contact details: +91 96180 76870 , +91 94406 24126

    #TALRadioTelugu #AarambhFoundation #AutismAwareness #AutismSupport #EarlyIntervention #ParentingTips #SpecialNeeds #AutismIndia #ChildDevelopment #InclusiveSociety #AutismTherapy #InspiringStories #PodcastInterview #ListenNow #TALRadio #TouchALifeFoundation

    Más Menos
    33 m
  • వాతావరణ మార్పుల వల్ల వచ్చే అలర్జీలు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 97
    Apr 1 2026

    ప్రస్తుత కాలంలో వాతావరణం లో మార్పులు జరిగినప్పుడు ముఖ్యంగా కాలం మారుతున్నప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య అలర్జీస్. గాలి, నీరు, ఆహారం ఇలా రకరకాల కారణాల వల్ల అలర్జీస్ వస్తుంటాయి. అసలు అలర్జీ అంటే ఏంటి? ఎలా వస్తాయి? ఆయుర్వేదంలో వీటికి పరిష్కారాలు ఏంటి? అలాగే అలర్జీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనుపమ గారు ఈ వారం మన ఆయుర్వేదం ఆరోగ్యం పాడ్కాస్ట్ లో చక్కగా వివరించారు.. సో.. మిస్ అవ్వకుండా వినండి!


    In today’s changing climate, especially during seasonal shifts, one of the most common problems people face is allergies. These can be caused by air, water, food, and many other factors. But what exactly are allergies? How do they occur? What solutions does Ayurveda offer? And what precautions can we take to prevent them?

    Renowned Ayurvedic doctor Anupama explains all these topics clearly in this week’s Ayurveda Arogya podcast. So… don’t miss it, give it a listen!

    Host: Renu Sree

    Guest: Dr. Anupama Uppuluri

    Dr. Anupama Contact Details:

    Mobile / WhatsApp: 9100052961

    #TALRadioTelugu #Allergies #SeasonalAllergies #Ayurveda #AyurvedaHealth #Arogya #HealthPodcast #AyurvedicTips #NaturalHealing #HealthyLiving #ImmunityBoost #LifestyleTips #WellnessJourney #AirAllergy #FoodAllergy #WaterAllergy #PreventAllergies #HealthAwareness #PodcastTelugu #TeluguPodcast #TALRadio #TouchALifeFoundation

    Más Menos
    26 m