Episodios

  • Chandamama kathalu/చందమామ కథలు(అంగవస్త్రం-100)
    Apr 10 2026

    అంగవస్త్రం
    ఆరావళీ కొండలలో చిదానందుడనే ఒక యోగి ఉండేవాడు. ఒకనాడు ఆయన తన పర్ణశాలలో జపం చేసుకొంటూవుంటే పన్నెండేళ్ల బాలు డొకడు ప్రాణభీతితో పరుగెత్తి వచ్చి పాదాల పైబడి, శరణుచొచ్చాడు, యోగి ఆ బాలుణ్ణి లేవనెత్తి, 'ఎవరు నువ్వు? యేమిటి ఆపద ?' అని అడిగాడు. ' నేను జసల్మీరు సంస్థానాధీశ్వరుడైన బీజీ రావువారి కుమారుణ్ణి, నా పేరు దేవ రాజు. శత్రువులు మా కోట వశం చేసుకుని మా తండ్రిని చంపేశారు. నన్ను చంపడానికి తరుముకొస్తున్నారు' అని చెప్పాడు.
    యోగి వెంటనే ఒక అంగవస్త్రం తెచ్చి ఆ బాలునికిచ్చి, నీ షరాయి, అంగీ విప్పివేసి దీన్ని కట్టుకో అని చెప్పి, ఆ రాజ పుత్రుని దుస్తులు కనపడకుండా చూరులో దోపివేశాడు. తన జందెపు పోచలలో ఒకటి తీసి, పిల్లవాడి మెడలో వేసి, నీ పేరు ఏమిటి? అని ఎవరైనా అడిగితే 'సోంభొట్లు' అని చెప్పు" అని సలహా యిచ్చాడు.
    అంతలో గుఱ్ఱపుడెక్కల చప్పుడు వినిపించింది. " అదుగో, వాళ్ళే వస్తున్నారు!". అన్నాడు దేవరాజు. 'భయపడకు. నాకొక విస్తరి వేసి నువ్వొక విస్తరి వేసుకో. అన్నం తిందాం' అన్నాడు యోగి.
    వాళ్ళందరూ వడ్డించుకుని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి గుర్రాలమీద వచ్చినవాళ్ళు దిగి, ఓరగా ఉన్న తలుపు తోసుకుని లోపలకు వచ్చారు. 'ఎవరు వారు ?' అన్నాడు. యోగి ఏమీ ఎరగనట్లు.
    ఆయన భోజనం చేస్తున్నాడని తెలవటంతో వాళ్ళు నాలిక కరుచుకుని, 'క్షమించండి. రాజపుత్రుడెవరైనా ఈ దారిని వచ్చా డేమో అని వచ్చాము ' అన్నారు. అందుకు యోగి, ' నేను వంట చేస్తూ ఇక్కడే వున్నానే. 'ఏమిరా సోంభొట్లూ, చితుకుల కోసం వెళ్ళినప్పుడు నీ కెవరైనా ఎదురు పడ్డారా?' అన్నాడు. దేవరాజు, 'నా కెవరూ కనపడలేదు గురువరా కొంచెం పులగం వడ్డించమన్నారా?' అని బదులు చెప్పాడు,

    Más Menos
    7 m
  • సామెతలు 1, 2, 3/Proverbs 1, 2, 3
    Apr 2 2026

    పెద్దలు తమ అనుభవంతో ఒక పరిస్థితిని మరోదానితో పోల్చి చెప్పేవే సామెతలు
    సామెత-1
    కోరి పిల్లనిస్తామంటే కులం తక్కువ అన్నట్లు
    భావం: మంచి అవకాశం సులభంగా దొరికినప్పుడు, దాని విలువ తెలియక వంకలు పెట్టేవారిని ఉద్దేశించి ఈ సామెత
    వాడతారు.
    సామెత-2
    ఇల్లు ఇరుకువాటంగా - ఇల్లాలు మరకతంలా ఉండాలి
    భావం: ఇల్లు ఇరుకువాటంగా అంటే ఇటు ఒక కిటికీ దానికి ఎదురు దిశలో మరొక కిటికీని ఉంచాలి. అప్పుడా ఇల్లు ఇరుకు వాటం (రెండు తలుపులున్నదై ఔతుంది) అవుతుంది. ఇటు నుండి గాలి అటు నుంచి వెళ్తూ అనారోగ్యాన్ని కల్గించదు. అలాగే ఇల్లాలు మరకతంలా ఉండాలి అంటే నవరత్నాలలో మరకతం యొక్క విలువ గొప్పగా ఉంటుంది కనుక ఇల్లాలు కూడా అంత గొప్పగా ఉండాలి అని అర్ధం.
    సామెత-3
    అంకపొంకాలు లేనిది శివలింగం
    ఈ సామెత ఈశ్వరుని గొప్ప తనాన్ని తెలియచేయుటకు వాడుతారు.
    శివలింగానికి అంకము (సంఖ్యా విలువ ) కానీ, పొంకము (గర్వము లేనిది అని అర్థం). అంటే అది మిక్కిలి గొప్పది అని మానవ సంఖ్యా శాస్త్రం లేదా సాధారణ గర్వానికి అతీతం అని వివరణ .

    Más Menos
    1 m
  • ఎటువంటి వాక్యాలను సామెతలు అంటారు ?
    Apr 2 2026

    సామెతలు 'సామ్యత' అనే పదం నుంచి వచ్చింది. సామ్యత అంటే పోలిక అని అర్ధం.
    సామెతలు (Proverbs) అంటే లోకానుభవాన్ని, నీతిని, సంస్కృతిని, సామాజిక విషయాలను తక్కువ పదాలలో, చమత్కారంగా తెలిపే చిన్న వాక్యాలు. వీటిని 'లోకోక్తులు' అని కూడా అంటారు. ఇవి మనిషి జీవితానికి, సమాజానికి మధ్య ఉన్న సంబంధాన్ని, అనుభవ సారాలను ప్రతిబింబిస్తూ భాషకు సౌందర్యాన్ని, జీవనాడులను అందిస్తాయి.
    పెద్దలు తమ అనుభవంతో చెప్పిన సత్యాలే సామెతలు
    తక్కువ పదాలు - ఎక్కువ అర్థం ఇచ్చేవే సామెతలు
    ఒక పరిస్థితిని మరోదానితో పోల్చి చెప్పేవే సామెతలు
    సామెత లేని మాట రుచిలేని వంటకం లాంటిది. అలాంటి సామెతలు
    నేటి యువత తప్పకుండా తెలుసుకోవాలి.

    Más Menos
    1 m
  • మనసు తత్వం అంటే ఏమిటి?
    Mar 31 2026

    అగ్నికి గంధపు చెక్క ,తుమ్మ చెక్క రెండూ సమానమే.! అలాగే మనసుకు ప్రపంచ విషయమైనా, భగవంతుడి విషయమైనా ఒకటే. తన సహజ స్వరూపంగా ఉన్నప్పుడు అది ఈ రెండింటిని వదిలేస్తుంది.
    పాదరసాన్ని చేతితో పట్టుకోవటం ఎలా సాధ్యం కాదో, మనసులో కూడా ఏ విషయాన్ని శాశ్వతంగా నిలిపి ఉంచటం సాధ్యంకాదు.
    ఉదయం చేసిన పనులన్నింటినీ రాత్రికి మనసు వదిలేస్తుంది. దాన్ని నిద్ర అంటున్నాం.
    అలాగే మంత్రజపం చేస్తూ వెళ్ళినా చేసిన పనులన్నింటినీ మర్చిపోయి జ్ఞాన నిద్రలోకి వెళ్తాము.
    మనసుకు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు ఉన్నాయి. అందువల్ల మనిషి ప్రతిదీ తాను స్వయంగా తెలుసుకోవాలనుకుంటాడు.
    అటుగా వెళ్తే కుక్క కరుస్తుందని ఎవరైనా చెప్పినా పూర్తిగా నమ్మడు. ఎప్పుడో ఒకసారి ఆ కుక్క వెంటపడితే గానీ ఆ విషయం అర్థంకాదు.
    ఏదైనా మనంతట మనంగా కనుక్కున్నది జ్ఞానం.
    మనసు దేన్నైనా వదిలేస్తుందని మంత్రజపంతో మనం స్వయంగా తెలుసుకుంటాం.
    ఎప్పుడైతే మనసుకి ఉన్న ఈ అలవాటుని మంచి వైపునకు మళ్ళిస్తామో
    అప్పుడు మనసే భగవన్నామంగా మారిపోతుంది...!

    Más Menos
    1 m
  • Chandamama kathalu/చందమామ కథలు(కుబేరుడి కొలను-99)
    Mar 29 2026

    పూర్వం దేవదత్తుడు కాశీ రాజ్యాన్ని పరి పాలిస్తూ ఉండే కాలమందు బోధిసత్వుడు ఆయనకు కుమారుడుగా పుట్టాడు. ఈ పుత్రునికి 'మహాశాసనుడు ' అనే పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. మరి కొద్ది కాలానికే రాజుకు మరి ఒక కొడుకు పుట్టాడు. ఈ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టి అపురూపంగా చేసుకుంటున్నారు. ఈ బిడ్డ లిద్దరూ పుట్టిన మరి రెండు సంవత్సరాలకు రాణి కాలగతి పొందింది. అందుచేత, దేవదత్తుడు మరి ఒక రాజ పుత్రికను వివాహం చేసుకొన్నాడు. మక్కువ కొద్ది కోరి పెళ్లాడిన ఈ రెండవ భార్యకు కూడా ఒక కుమారుడు కలిగాడు.
    చిన్న రాణికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బిపోయాడు. సంతోషం పట్టలేక భార్యతో, పుత్రునికి సంబంధించిన వరం ఏదైనాసరే, కోరుకోమన్నాడు. అందుకు ఆమె 'ఇప్పుడేమీ అవసరం లేదు. పని పడినప్పుడు నా అంతట నేనే వచ్చి కోరు కుంటాను' అని బదులు చెప్పింది. 'సరే'నన్నాడు రాజు.
    చిన్నరాణి కొడుకునకు ఆదిత్యు' డని నామకరణం చేశారు. ఆదిత్యుడు దినదిన ప్రవర్థమానుడై, రాజులకు ఉచితములైన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై, క్రమంగా యౌవన వంతుడయ్యాడు.

    Más Menos
    8 m
  • ఆంజనేయునికి తమలపాకులతోనే ఆకు పూజని ఎందుకు చేస్తారు?
    Mar 24 2026

    ఆంజనేయుడు వనఫలప్రియుడు అంటే అడవిలో ఉండే చెట్లకి కాసిన ఫలాలని తినడం ఇష్టంగా కలిగిన వాడని అర్థం. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది - ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ''స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు 'తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ,అరటి తోటలలోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.

    Más Menos
    1 m
  • గురువుకూ, సద్గురువుకూ తేడా ఏమిటి ?
    Mar 17 2026

    గురువుకు, సద్గురువుకు మధ్య ప్రధాన తేడా జ్ఞాన స్థాయి మరియు ఆధ్యాత్మిక పరిణితి. గురువు అంటే విద్య, శాస్త్రాలు లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే మార్గదర్శి. సద్గురువు ఆత్మసాక్షాత్కారం పొంది, శిష్యుడి అజ్ఞానాన్ని పోగొట్టి, మోక్ష మార్గంలో నడిపించే పరిపూర్ణ జ్ఞాని. గురువు శిక్షణ ఇస్తే, సద్గురువు అంతర్గత జ్యోతిని వెలిగిస్తాడు. ప్రతి గురువు సద్గురువు కాకపోవచ్చు, కానీ ప్రతి సద్గురువు గురువు అవుతాడు. సద్గురువులే ఉత్తమమైన గురువులు.

    Más Menos
    1 m
  • శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి దేవుడ్ని ఎందుకు చూస్తారు?
    Mar 15 2026

    శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం అంటే, నంది యొక్క ఏకాగ్రతను, భక్తిని అనుసరిస్తూ మనశ్శాంతితో భగవంతునిలో లీనమవ్వడమని అర్థం. నంది శివుని వాహనంగా, ద్వారపాలకుడిగా మరియు అత్యంత భక్తుడిగా శివలింగం వైపు నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటాడు.
    నంది కొమ్ముల మధ్య నుండి చూడటం వలన మనసు అటు ఇటు తిరగకుండా, నేరుగా శివునిపై లగ్నమవుతుంది, దీనినే 'సదాశివ ధ్యానం' అంటారు.
    నంది పరమశివుని అంతరంగిక భక్తుడు, ద్వారపాలకుడు. ఆయన అనుమతి తీసుకుని, నంది దృష్టిలో ఉన్న శివుణ్ణి దర్శించుకోవడం సంప్రదాయం.
    శివలింగం నుండి వచ్చే అపారమైన శక్తి నందికి చేరుతుంది. ఆ కారణం చేత నంది-శివలింగాల మధ్యలో నిలబడకూడదని పెద్దలు చెబుతారు. నంది కొమ్ముల ద్వారా ఆ శక్తి భక్తులలోకి ప్రసరించి, మనశ్శాంతిని, ఏకాగ్రతను పెంచుతుందని నమ్ముతారు.
    నంది చెవిలో మన కోరికలను చెప్పుకోవడం ద్వారా అవి శివునికి చేరుతాయని నమ్మకం.
    శివుడు ధ్యానంలో ఉంటాడు, నంది కొమ్ముల మధ్య నుంచి దర్శించడం ద్వారా మనం ఆ ధ్యానానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తాము.

    Más Menos
    1 m