Chandamama kathalu/చందమామ కథలు(అపూర్వ త్యాగం-44) Podcast Por  arte de portada

Chandamama kathalu/చందమామ కథలు(అపూర్వ త్యాగం-44)

Chandamama kathalu/చందమామ కథలు(అపూర్వ త్యాగం-44)

Escúchala gratis

Ver detalles del espectáculo

OFERTA POR TIEMPO LIMITADO | Obtén 3 meses por US$0.99 al mes

$14.95/mes despues- se aplican términos.
ఈనాటి మన కథ అపూర్వ త్యాగం. ఇది చందమామ కథలులో వచ్చిన యధార్థ గాథ. అనంతపురం జిల్లాలో 'బుక్కరాయ సముద్ర ' మనే ఒక గ్రామమున్నది.ఆ వూరిలో గొప్ప చెరువు ఒకటున్నది. ఒకయేడు వర్షకాలం ఆ ప్రాంతంలో అతివృష్టిగా వానలు కురిశాయి. ఎడతెరపి లేకుండా అహోరాత్రాలు అలా కురిసే వర్షానికి జనమంతా హడిలిపోయి, " ప్రళయకాలం ఇప్పుడే వచ్చేసిందా !" అని అనుకొని ప్రాణాలు పిడికిట్లో పెట్టుకునివున్నారు.ఆ వర్షానికి గ్రామంలోని చెరువు నిండిపోయి, గట్టుకి ఎగదాసింది. ఈ పరిస్థితి చూచి గ్రామస్థులు "అయ్యో దేముడా ఇంకేమున్నది ! ఇంతవరకు వచ్చిన తర్వాత గండి వేయకుండా గట్టు నిలిచివుంటుందా! ఆ కాస్తపనీ జరిగిందో, ఈగ్రామమే కాదు, చుట్టుపక్కల ఎన్నో పల్లెలు గోవిందా అని మునిగిపోవక తప్పదు. అలా మునిగిపోవటమే తటస్థించినపక్షమందు హరిహరీ ! ఎంత పశు నష్టం! ఎంత జనసష్టం! ఎన్ని జీవాలు మట్టి కలిసిపోతై! ఎన్ని కుటుం బాలు కూలిపోతవి? దేముడు ఎందుకిలా భీకర స్వరూపం తాల్చాడో ? అకారణంగా మరణించటానికి ఇంతమందీ చేసుకున్న పాపం యేమిటో?” అని పరిపరివిధాల యోచనలు చేయసాగారు.జనమంతా ఈవిధంగా హాహాకారాలెత్తి పోతూవున్న సమయంలో ఒకనికి మైకము కమ్మి, ఆ మైకంలో ఆకాశవాణి "ఓయి అబ్బాయీ! మీ గ్రామంలో వుండే ముసలమ్మ అనే అమెను ఈ చెరువుకు బలి యిచ్చినట్టయితే ఈ వర్షాలు వెంటనే ఆగిపోతాయి: ఆపద తొలగిపోతుంది " అని పలికినట్టయిందట. కర్ణకఠోరమైన ఈ మాట అతను చెప్పగా విన్నవాళ్లం దరకూ వళ్లు జల్లుమన్నది. ఏమీ అంటే ముసలమ్మ అనగా వృద్ధురాలు కాదు. పడుచావిడి. ఆమె పేరుమాత్రమే ముసలమ్మ. ఈ ముసలమ్మ మంచి ఇల్లాలు. రూపసి, అత్తమామల పట్ల వినయవతి, భర్తపట్ల అనుకూలవతి. పైగా ఉదారబుద్ధిగలవివేకవతి. ముసలమ్మ అంటే ఊళ్లో అందరకూ ప్రాణమే. అంతగా అందరకూఇష్టురాలై తలలో నాలుకగా మసలుకొంటూ వున్న ముసలమ్మ బలి కావటమా? ఎవరుభరించగలరు ఇటువంటి మాట ?ఐతే—ఊళ్లో అందరూ కంగారుపడి తలకొక విధంగా అనుకుంటున్నారు కానీ, ఈ మాట చెవిని పడినప్పుడు ముసలమ్మ మాత్రం ఏమీ కలత చెందలేదు."ఈ వార్త యేమిటి, పిడుగులాగా వచ్చి పడిందే!" అని గ్రామస్థులు పెద్దమర్రికింద కూడి విచారిస్తూవుండగా, ముసలమ్మ. అక్కడికి వచ్చి, 'అయ్యా ఎందుకలా విచారిస్తారు? పుట్టిన ప్రతి జీవుడూ గిట్టక తప్పదుకదా ! ఈ పరమసత్యాన్ని రోజూ మన కళ్లతో మనం చూస్తూనే ఉన్నామే ! ...
Todavía no hay opiniones