తెలుగు భాషా దినోత్సవం Podcast Por SBS arte de portada

తెలుగు భాషా దినోత్సవం

తెలుగు భాషా దినోత్సవం

De: SBS
Escúchala gratis

Acerca de esta escucha

తెలుగు రచయితల ఆలోచనాధారలో మార్పులు తెచ్చి సాహిత్య ప్రవాహాన్ని గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాషకు మరల్చిన వ్యావహారిక భాషా పితామహుడు, అభినవ వాగమశాసనుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. 1919లో ‘తెలుగు’ అనే మాసపత్రికను స్థాపించి మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగతి సాధించాలంటే వాడుక భాషలో పాఠ్యగ్రంధాలుండాలని వ్యావహారిక భాషావాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే, భాషాభివృద్ధిని కొంతపుంతలు తొక్కించిన వ్యావహారిక భాషా కర్షకుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. వారి జన్మదినమైన ఆగష్టు 29వ తేదిని తెలుగు జాతి అంతా తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటోంది. ఈ తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలుగ భాష ఔనిత్యాన్ని చాటే కార్యక్రమాలను ఈ నెలలో ప్రతి గురువారం SBS తెలుగు భాషాభిమానులకు, తెలుగు శ్రోతలకు అందించనుంది.Copyright 2025, Special Broadcasting Services Ciencias Sociales
Episodios
  • తెలుగు భాషా దినోత్సవం EP1: తెలుగు భాషా ప్రశస్తి
    Jul 31 2024
    ‘భాష’ అంటే భావాన్ని వ్యక్తం చేసేది. అలాంటి అమ్మభాషతో మనిషి బంధం ఉమ్మ నీటిలో ఉన్ననాటిది. అది మన పుట్టకతో మొదలవుతుంది. మనం గిట్టినా అనంత విశ్వంలో విహరిస్తూనే ఉంటుంది.
    Más Menos
    9 m
  • తెలుగు భాషా దినోత్సవం EP2: తెలుగు సాహిత్యానికి తలమానికం శతక సాహిత్యం
    Aug 8 2024
    శాఖోపశాఖాలుగా విస్తరించిన తెలుగు సాహితీ విపణిలో శతకపద్య ప్రక్రియ ఒకటి. 12వ శతాబ్ధంలో మొదలైన శతక సాహిత్య పరిమళాలు నేటి ఆధునిక కాలంలో కూడా గుభాళిస్తున్నాయి.
    Más Menos
    15 m
  • తెలుగు భాషా దినోత్సవం EP3: తెలుగు సాహిత్యంలో జాతీయత.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు...
    Aug 15 2024
    సమాజంలోని మార్పులకు అనుగుణంగా కవులు స్పందించటం పరిపాటి. నాడు ఆంగ్లేయుల దాస్య శృంఖలాలు నుంచి విముక్తి పొందటానికి చేసిన పోరాటంలో అనేకమంది తెలుగువారు ప్రాణాలు అర్పించారు. తెలుగు కవులు కూడా తమ వంతుగా స్వాతంత్రోద్యమ భావనను రగిలించే రచనలు చేసి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించారు.
    Más Menos
    17 m
adbl_web_global_use_to_activate_T1_webcro805_stickypopup
Todavía no hay opiniones